నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద తీవ్రం కావడంతో.. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కుమ్మరి రంజిత్ ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోవడంతో.. యూట్యూబ్‌లో చూసి ఒక ఐడియాను అమలు చేశారు. తానే స్వయంగా ఎలుగుబంటి వేషధారణ ధరించి వీధుల్లో తిరుగుతూ కోతులను తరిమికొట్టారు. ఎలుగుబంటిని చూసి భయపడిన కోతులు గ్రామం విడిచి పారిపోయాయి. ఈ వినూత్న ప్రయత్నానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.