Konaseema District Collector Fell Into Canal: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పులిదిండిలో పడవ పోటీల ట్రయల్ రన్‌లో ఆయన కాలువలో పడిపోయినా, స్విమ్మర్లు కాపాడారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల్లో అంతర్వేదిలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో థార్ వాహనంతో సముద్రంలోకి దూసుకెళ్లిన యువకుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా, మరో యువకుడు గల్లంతయ్యారు.