Demand For Kosa meat: ఏపీలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా కోస్తాంధ్రలో కోడి పుంజు కత్తికట్టి బరిలోకి దూకుతోంది. అటు రాయలసీమ జిల్లాలలోనూ పందెం కోడి కాలు దువ్వుతోంది. ఇక గోదావరి జిల్లాలో కోడిపందేల కోసం ప్రత్యేకంగా ఏర్పా్ట్లు చేశారు. అయితే కోడి పందేలలో చనిపోయిన కోడికి కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ కోడిపుంజు మాంసాన్ని కోస మాంసం అంటారు. ఈ కోస మాంసం కోసం భారీగా డిమాండ్ ఉంది. దీంతో కొంతమంది మామూలు కోళ్లకే గాట్లు పెట్టి.. కాల్చి కోస మాంసంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.