హైదరాబాద్ ఖాజాగూడలో కాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఓ యువకుడిని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సర్వాయ్‌పేటకు చెందిన నితిన్.. కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో నితిన్ చెప్పిన మాటలకు మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.