క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టార్గెట్.. వాటిపై క్లిక్ చేస్తే మీ జేబుకు చిల్లు పడినట్లే..

2 months ago 6
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల తరుణంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. పండుగ ఆఫర్లు, లక్కీ డ్రాలు, ఉచిత బహుమతుల పేరుతో వాట్సాప్, ఈమెయిళ్లకు ఆకర్షణీయమైన సందేశాలు పంపిస్తున్నారు. వీటిలోని అనుమానాస్పద లింకులను క్లిక్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకే విమాన, బస్సు టిక్కెట్లు ఇస్తామనే నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, ఓటిపిలు పంచుకోవద్దు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article