డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కకుండా ఓ మందుబాబు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కారు ఓనర్.. తన కారు నంబర్ ప్లేటును క్షణాల్లో మార్చేలా ఒక స్పెషల్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక్క బటన్ నొక్కితే చాలు.. కారు నంబర్ ప్లేటు క్షణాల్లో మారిపోయి వేరే కారు నంబర్ ప్లేట్ వచ్చేలా టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. అయితే తాజాగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అసలు విషయం బయటికి రావడంతో ఆ మందుబాబు అడ్డంగా దొరికిపోయాడు.