ఓ సినిమా హిట్ కావడానికి బడ్జెట్‌కి సంబంధం లేదు. ఇప్పటి వరకు ఎన్నో మూవీస్ దీన్ని నిరూపించాయి. కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టాయి. అలానే భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవి ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. అయితే అతి తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఒక లేటెస్ట్ మూవీ మాత్రం అటు సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసింది.