మనిషి జీవితం ఎప్పుడు.. ఎలా ముగుస్తుందో చెప్పలేము. అయితే కొందరు విచిత్రంగా మరణిస్తారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఖర్జూరం ఓ వ్యక్తి ప్రాణాలు తీయడం సంచలంనగా మారింది. ఆ వ్యక్తి ఖర్జూరం తిటుండగా.. గింజ గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సత్య సాయి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆరోగ్యం కోసం తిన్న ఖర్జూరమే ఇలా ప్రాణాలు తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.