హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో 20 వేల మంది పోలీసులు, ఇతర జిల్లాల నుంచి 8,400 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ శోభాయాత్రలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. నిమజ్జన మార్గాల్లో 24 డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు, హుస్సేన్‌సాగర్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. అసభ్యకర డాన్స్‌లు, నిబంధనలకు విరుద్ధమైన డీజేలు, ఫేక్ వీడియోలు, మత సామరస్యానికి భంగం కలిగించే సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.