హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేశుడు ఈసారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఐదు ముఖాలు, ఐదు పడగలతో పాటు సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విగ్రహం తయారీ కోసం తెలంగాణ, ఏపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా కళాకారులు మూడు నెలలపాటు శ్రమించారు. రాజస్థాన్ సహజ నదీమట్టి, ఇసుక, కర్రలు, స్టీల్, వరి గడ్డితో పర్యావరణహితంగా విగ్రహాన్ని రూపొందించారు.