హైదరాబాద్ గణపతి ఉత్సవాల్లో భాగంగా భక్తుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. 12 రోజుల పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. కొన్ని మార్గాల్లో నేరుగా రాకపోకలకు అనుమతిపై నిషేధం విధించారు. అత్యవసర ట్రాఫిక్ సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం నేపథ్యంలో ఆ మార్గాల్లో వాహనాల దారి మళ్లింపులు చేపట్టనున్నారు.