గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అమ్మాయిలు.. చెడు వ్యసనాలకు బానిసై చీకటి దందా

3 days ago 2
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇష్రాత్ భానో,ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన కాంచన్ ఇద్దరూ కలిసి గంజాయి సరఫర చేస్తునట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్న ఇద్దరు యువతులు.. చెడు వ్యసనాలకు బానిసై గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో గంజాయిని తరలిస్తుండగా.. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు యువతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Entire Article