హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సొసైటీ లేఅవుట్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. రోడ్లను ఆక్రమించారని స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు, భవన నిర్మాణ అనుమతులు లేకుండా పనులు చేపట్టేవారికి ఈ చర్య ఒక గట్టి హెచ్చరికగా చెప్పుకోవచ్చు.