గజ్వేల్ తహశీల్దార్‌పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. రైతుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తహసీల్దార్ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్డీవో ప్రాథమిక నివేదిక సమర్పించగా.. దాని ఆధారంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే, ఈ సంభాషణ 6 నెలల క్రితం జరిగిందని రైతు స్పష్టం చేశారు. తన కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాన్ని పరిష్కరించడంలో తహశీల్దార్ సహకరించారని.. ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణకు సంబంధించిన పరిహారం కూడా అందిందని తెలిపారు. ఈ పరిణామం అధికారులు.. ప్రజలతో వ్యవహరించే తీరుపై మరోసారి చర్చకు కారణమైంది.