ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తెకు రేవంత్ రెడ్డి సర్కార్‌లో సముచిత స్థానం దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్‌లో కీలక బాధ్యతలు అప్పగించి.. గద్దర్ కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఇచ్చింది. తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్‌గా డాక్టర్ గమ్మడి వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. వెన్నెలకు కేబినెట్ హోదా కల్పించకపోవటం గమనార్హం.