తమ కుమార్తె తమను కాదని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని యువతి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. ఆగ్రహంతో యువకుడి ఇళ్లను కూల్చివేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గద్వాల మండలానికి చెందిన యువతీ యువకులు హైదరాబాద్‌లో వేర్వేరు పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించగా.. పెద్దలు కాదంటారనే భయంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. అయితే తమ కూతురు తమను కాదనుకుందనే కోపంతో యువతి కుటుంబసభ్యులు యువకుడి ఇంటితో పాటు, అతని చిన్నాన్న ఇంటిని ధ్వంసం చేశారు.