YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ హైదరాబాద్ గాంధీ భవన్‌లో ప్రత్యక్షమై అందర్ని ఆశ్చర్యపరిచారు. కొత్తపీసీసీగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి వైసీపీ ఎంపీ, బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య ఆయనకు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి పూల బొకే అందించారు.