Doctor Naresh Babu Rs 40 Lakhs Donation: చదువుకున్న కాలేజీ కోసం భారీ సాయం అందిస్తూ గొప్ప మనసు చాటుకున్నారు గుంటూరుకు చెందిన డాక్టర్ నరేష్‌బాబు.. ఏకంగా రూ.40 లక్షలు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపల్‌ను కలిసి పనులు ప్రారంభించాలని చెప్పారు. తనతో పాటు తన తల్లి, ఇద్దరు సోదరులు కూడా అదే కాలేజీలో చదువుకున్నారని.. తనకు చదువు చెప్పిన కాలేజీ కోసం తన వంతుగా ఈ సాయం చేస్తున్నట్లు తెలిపారు.