ఏపీ పోలీసులు సాంకేతికత వినియోగంలో దూసుకెళ్తున్నారు. టెక్నాలజీ సాయంతో నేరాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా పేకాట, బహిరంగ మద్యపానం, గంజాయి సరఫరా, ఈవ్‌టీజింగ్ వంటి నేరాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా పోలీసులు ఓ మారుమూల ప్రాంతంలోకి డ్రోన్ ఎగరేశారు. ఈ క్రమంలోనే లారీలో గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న పేకాట యవ్వారం బయటపడింది. దీంతో పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.