రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు హార్డ్ కాపీలు సమర్పించని కారణంగా.. వారికి మే 2, 2025 వరకు మరో అవకాశం కల్పించారు. హార్డ్ కాపీలను వారి మండల కార్యాలయాల్లో సమర్పించవచ్చు. ఈ పథకం ద్వారా యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడంతో పాటు.. ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద ఆన్‌లైన్‌లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు.