కామారెడ్డి జిల్లా బాన్సువాడ గురుకుల పాఠశాలలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. చదువుకొని గొప్పస్థాయికి చేరుతుందనుకున్న 8వ తరగతి విద్యార్థిని సంగీత, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యానికి బలైపోయింది. ప్రిన్సిపాల్ తన సొంత ఇంటి ఫంక్షన్ కోసం స్కూల్ ఫర్నిచర్‌ను తరలించేందుకు ఈ చిన్నారిని ఆటోలో పంపారు. తిరిగి వస్తుండగా ఆటో నుండి ప్రమాదవశాత్తు కిందపడటంతో సంగీత అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ‘చదువుకోవడానికి పంపితే నా బిడ్డను చంపేస్తారా’ అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.