తెలంగాణ ప్రభుత్వ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తరగతితో పాటు 6-9 తరగతుల్లో ఖాళీ సీట్లకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉచిత వసతితో కూడిన నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించే ఈ గురుకులాల్లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.