గూడు లేని పేదలకు తీపి కబురు.. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు.. 7 ప్రాంతాలు ఎంపిక

3 weeks ago 5
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్థలాల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సీఎం ఆదేశాల మేరకు ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే నగరంలోని నాంపల్లి, మల్లేపల్లి, రెడ్‌హిల్స్, మలక్‌పేట, బహదూర్‌పుర, కూకట్‌పల్లి సహా 7 ప్రధాన ప్రాంతాలలో స్థలాల ఎంపిక పూర్తయింది. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అనువైన భూములను పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం.. వారం రోజుల్లో పూర్తిస్థాయి ప్రణాళికతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
Read Entire Article