గోదాట్లోకి దూకే ప్రయత్నం.. చాకచక్యంగా కాపాడిన జర్నలిస్టులు

1 year ago 21
భద్రాచలంలో బ్రిడ్జి పైనుంచి గోదాట్లోకి దూకి ఆత్మహత్య కు ప్రయత్నించిన వ్యక్తిని జర్నలిస్టులు చాకచక్యంగా కాపాడారు. వంతెన రెయిలింగ్‌పైకి ఎక్కిన యువకుడ్ని వద్దని వారించిన జర్నలిస్ట్‌లు ఎండి అబ్దుల్ ఘనీ, ఎస్కే జాకీర్, ఘని స్నేహితుడు .. నీ సమస్య ఏంటో చెప్పాలని అతడ్ని దూకొద్దని సూచించారు. నీకు ఏం కావాలో చెప్పమని, తాము ఇస్తామని చెప్పారు. వద్దు.. వద్దు.. నువ్వు ఇటురా.. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటావు.. నీకు ఏమైందని అతడ్ని మాటల్లో దించి.. ఇవతలి వైపు నుంచి ఒకరు యువకుడు కూర్చొన్న చోటుకు వెళ్లి చాకచక్యంగా పట్టుకుని కిందకు దింపారు. ఆత్మహత్యాయత్నం చేయబోయిన అతడ్ని సారపాకకు చెందినవాడిగా గుర్తించారు.
Read Entire Article