గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దాదాపు అంగీకారం తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎన్ఓసీ జారీ చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ సీఎంకు మంత్రి ఉత్తమ్ లేఖ రాయగా.. సోమవారం స్వయంగా వెళ్లి కలిశారు. దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి దాదాపుగా అడ్డంకులు తొలిగిపోయినట్లే కనిపిస్తోంది.