గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ఉత్తర్వులు జారీ..

3 months ago 9
గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. స్పౌస్ గ్రౌండ్స్‌పై ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫర్లకు ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ట్రాన్స్‌ఫర్ల కోసం పలు నిబంధనలు విధించారు. అలాగే భార్యాభర్తలలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగులు అయితేనే బదిలీల కోసం పరిగణిస్తారు. అలాగే కేసులు ఉంటే పరిగణనలోకి తీసుకోరు. ఈ మొత్తం ప్రక్రియను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Entire Article