Andhra Pradesh Gramakantam Land Registration Details: ఏపీలో గ్రామ కంఠంలోని స్థలాలు, ఇళ్లకు రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన స్థలాలకూ చేయాల్సిందే.. రికార్డులు, పత్రాల కోసం ఒత్తిడి చేయొద్దని ఆదేశించారు. ఆ కారణంగా రిజిస్ట్రేషన్లను ఆపొద్దని.. ఒకవే ఎవరికైనా సరైన పత్రాలు లేనివారి నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకోవాలని సూసచించారు. నిషేధ జాబితాలో ఉన్నవాటికీ విముక్తి లభించింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేశారు అధికారులు.