Telangana R and B Roads Development: తెలంగాణ సర్కార్.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి భారీగా ఖర్చు చేయనుంది. రూ.60 వేల కోట్లతో రాష్ట్రంలో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నాడు ఆయన నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్డు నుంచి దర్వేశిపురం వరకు 4 లేన్ల రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. రాబోయే మూడేళ్లలో గ్రామాల్లో సమూల మార్పులు తెస్తామని, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రతి గ్రామంలో రేషన్ షాపులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.