మార్చి 2 నుంచి జూన్ 9 వరకు తెలంగాణ సర్కార్ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ 'హెల్త్ మిషన్-100' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమం కింద 42 లక్షల మంది స్వయం సహకార సంఘాల్లోని మహిళలకు టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా 30 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.