గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న టైంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌లో టెస్టులు చేయించుకుంటున్న ఫొటోలు బయటకొచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ సమస్యను పక్కదారి పట్టించడం కోసమే ఇలా చేస్తున్నాంటూ సోషల్ మీడియాలో ఓ యూజర్ పోస్టు చేశారు. మరి ఈ ప్రచారం నిజమేనా..? అంటే కాదనే చెప్పాలి. పవన్ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఫిబ్రవరి 6న జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా దూరమయ్యారు.