అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజధానికి భూములిచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు. అత్యాధునిక హంగులతో ఏడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో.. వివిధ విభాగాల కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. దీంతో పరిపాలన సౌలభ్యం మెరుగుపడనుంది. ఈ భవనంలో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, మీటింగ్ హాల్స్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు, ఉన్నతాధికారుల ఛాంబర్లు కూడా ఉన్నాయి.