ఎదురెదురుగా వస్తున్న ఆటో.. కారు ఒకదానినొకటి ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి.. ఎదురుగా వస్తోన్న ఆటోలను ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.