ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సరికొత్త ఆలోచన చేశారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్ విధానం అమలుచేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు రాష్ర్టంలో ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్‌బుక్ విధానం తేనున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలని చంద్రబాబు కోరారు.