వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో.. ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రాజెక్టు ఘనత తమకే దక్కుతుందంటూ టీడీపీ, వైసీపీ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎంట్రీ ఇచ్చారు. వెలిగొండ వెలుగు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనన్న షర్మిల.. చంద్రబాబు రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించారు షర్మిల..