P Letter To Clear Furniture Ys Jagan Camp Office: ఏపీలో ఫర్నిచర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ తీసుకెళ్లాలని జీఏడీకి వైఎస్సార్‌సీపీ లేఖ రాసింది. ఫర్నీచర్‌ను వెంటనే తీసుకెళ్లాలని కోరారు.. లేదంటే ఎక్కడికి పంపమంటే అక్కడికి పంపిస్తామని చెప్పారు. ఒకవేళ తీసుకెళ్లడం ఇష్టంలేకపోతే ఖరీదు చెబితే చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు. త్వరగా సమాధానం చెప్పాలని జీఏడీని కోరారు.. ఇప్పటికే నాలుగు సార్లు లేఖ రాశామని కూడా గుర్తు చేశారు.