Amaravati Irr Alignment Case Closed: విజయవాడ ఏసీబీ కోర్టు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్‌పై సీఐడీ నమోదు చేసిన కేసును మూసివేసింది. గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. అయితే సీఐడీ ఈ కేసును మరోసారి దర్యాప్తు చేసి మిస్టేట్ ఆఫ్ ది ఫ్యాక్ట్‌గా తేల్చింది. అయితే మళ్లీ ఆళ్ల హైకోర్టు, ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. ఈ క్రమంలో మంగళవారం రోజు సీఐడీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసును మూసివేసింది.