Supreme Court Dismisses Petition Against Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేశారు. చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్ వేసిన హైకోర్టు బాలయ్య తరపు లాయర్‌పై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై వాదించడానికి ఎలా వచ్చారని లాయర్‌ను ప్రశ్నించారు. దీనిపై ఒక్కమాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తి హెచ్చరించారు.