ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును యంగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ కూడా ఉన్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు బహుకరించారు. నితీష్ కుమార్ రెడ్డికి అతి త్వరలో ఇంటి స్థలం కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.