2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా లాంటి నేతల వద్ద జనసేనానికి మంచి ప్రాధాన్యం లభిస్తోంది. దీంతో జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ముర్ము పవన్‌కు గిఫ్ట్ ఇచ్చారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.