రైలు ప్రయాణమంటే అదో మధురమైన అనుభూతి.. కొత్త మనుషులు, కొత్త పరిచయాలు, కొత్త ప్రదేశాలు.. కొత్త అనుభవాలు.. అంతా కొత్తగా, సరికొత్తగా.. కానీ ఆ అమ్మాయికి మాత్రం ఆ ప్రయాణం.. కాళ రాత్రిని మిగిల్చింది. జీవితంలో మరిచిపోలేని భయానక అనుభవాన్ని అందించింది.. అంతటికీ కారణం S7లోని సీటు నంబర్ 7.. నర్సాపురం - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ యువతికి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీటు ఇస్తానంటూ ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో టీటీ. ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులకు గురిచేశాడు. బాధిత యువతి ఫిర్యాదుతో టీటీకి విజయవాడ రైల్వే అధికారులు మెమో జారీ చేశారు. అలాగే భీమవరం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.