చిట్టీల పేరుతో కాలనీ వాసులను మోసం చేసిన ఓ జంట.. ఏకంగా రూ.2 కోట్లు కొట్టేసిన సంఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. కాలనీ అధ్యక్షుడు అని నమ్మి.. రూపాయి, రూపాయి పోగేసి చిట్టీలు కడితే.. ఆ మొత్తం సొమ్మును ఆ కిలాడీ దంపతులు కొట్టేశారు. గత 10 ఏళ్లుగా ఆ జంట చిట్టీల వ్యాపారం చేస్తుండటంతో.. అంతా నమ్మి డబ్బులు ఇచ్చి ఇప్పుడు నట్టేట మునిగిపోయారు.