చిన్న క్లూతో.. భద్రాచలం సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. ఏం జరిగిందంటే..

1 month ago 9
భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ షేక్ ఖదీర్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన బూర్గంపాడులో పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఖదీర్ తన బ్యాంక్ ఖాతాతో పాటు కార్యాలయ సిబ్బంది అకౌంట్ల ద్వారా కూడా లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. 2025 జూన్‌లో జరిగిన తనిఖీల అనంతరం బ్యాంక్ స్టేట్‌మెంట్లను విశ్లేషించి ఈ చర్య తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ రమేశ్ ప్రజలకు సూచించారు.
Read Entire Article