విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కుక్కను ఢీకొనడంతో చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. ఎయిర్‌బ్రేక్ పట్దేయటంతో దాదాపు 27 నిమిషాలు రైలు ఆగింది. మరమ్మతుల అనంతరం రైలు బయలుదేరింది. ఇదిలా ఉండగా, మహబూబాబాద్ జిల్లాలో విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ రైలు ఎద్దును ఢీకొట్టింది, పది నిమిషాల పాటు నిలిచిపోయింది.