ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. తాజాగా చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి కోరింది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కేవీఎస్ ఇన్ ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తుల జప్తునకు కూడా ఆదేశాలు జారీ చేసింది.