Andhra Pradesh Weavers Free Power Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలిచింది. చేనేత, పవర్ లూమ్ రంగాలకు చేయూత నిచ్చేందుకు ఉచిత విద్యుత్ పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్ పథకం కింద పవర్‌లూమ్ చేనేతలకు 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. లక్ష కుటుంబాల వరకు లబ్ధిపొందనున్నారు.