Polavaram Atm Pan Cards Found In Pond: పోలవరం జిల్లాలో చెరువులో చేపల పేటకు వెళ్లిన వారికి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. చేపలు పట్టేందుకు వల విసిరితే.. చేపలు బదులు ఏటీఎం, పాన్ కార్డులు బయటపడ్డాయి. చెరువులో కార్డుల్ని చూసిన జనాలు షాకయ్యారు. అసలు చెరువులోకి ఆ కార్డుల్ని ఎవరు వేసి ఉంటారనే చర్చ మొదలైంది. ఆ చెరువుకు దగ్గరలో పోస్టాఫీస్ ఉండటంతో అధికారులు ఈ అంశంపై ఆరా తీస్తున్నారు.