ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి సర్కారును టార్గెట్ చేసే విషయంలో మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ వెనక్కి తగ్గడం లేదు. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చకపోవడం పట్ల విమర్శలు గుప్పిస్తోన్న కేటీఆర్.. పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకం అవుతూ.. జనాలను మళ్లీ బీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు.