పల్నాడు జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి సోదరులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రేపు (గురువారం) మాచర్ల కోర్టు ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీడీపీ నేతలు జె.వెంకటేశ్వర్లు, జె.కోటేశ్వరరావుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబర్ నెలాఖరులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెండు వారాల్లో లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.