ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ర్యాలీ చేశారు. జగన్ నివాసం ముందు హారన్లు కొడుతూ తెలుగు తమ్ముళ్ల హడావుడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ర్యాలీని అక్కడి నుంచి పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.