మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శల పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్. తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీకి రౌడీయిజం చేయడానికి వచ్చారని ధ్వజమెత్తారు. పరామర్శకు వచ్చి జై జగన్ నినదాలు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాళ్లు చేతుల్లో పెట్టుకుని కనిపించారని ఆరోపించారు. ఈ మేరకు కొన్ని వీడియోలను మీడియాకు విడుదల చేశారు.